'సింగం' క్యారెక్టర్ పరువు తీసిన కమెడియన్...తిడుతున్న నెటిజన్స్!
on Nov 28, 2022
జబర్దస్త్ వచ్చే వారం ఎంటర్టైన్ చేయడానికి అప్పుడే రెడీ ఐపోయింది. దానికి సంబంధించిన లేటెస్ట్ ప్రోమో రిలీజ్ అయ్యింది. నూకరాజు ఈ మధ్య మూవీ సెలెబ్స్ ని ఇమిటేట్ చేయడానికి చాలా ట్రై చేస్తున్నాడు. కానీ అవి ఏమంత పేలడం లేదు. జాతిరత్నాలు షోలో "ఒక్కడు" మూవీలోని మహేష్ బాబుని ఇమిటేట్ చేస్తే ఆయన ఫాన్స్ "ఎక్కువ చేయొద్దు" అన్నారు.
ఇక ఇప్పుడు లేటెస్ట్ జబర్దస్త్ ప్రోమోలో "సింగం" మూవీ నుంచి సూర్యని ఇమిటేట్ చేయడానికి ట్రై చేసాడు. ఆ మూవీ స్పూఫ్ చేసాడు కమెడియన్ నూకరాజు, దొరబాబు టీమ్. నూకరాజు పోలీస్ గెటప్ లో వచ్చి టీంలో ఒకతన్ని ఎగిరెగిరి కొడతాడు సూర్యలాగ. ఇంతలో దొరబాబు వచ్చి "సింగం అని చెప్పి ఆగమాగం చేస్తున్నాడు ఎవరితను" అనేసరికి సూర్య లాగా స్పీడ్ గా ఏదో డైలాగ్ చెప్పడానికి ట్రై చేసాడు నూకరాజు. కానీ ఆ మాటలు ఏమీ అర్ధం కానీ దొరబాబు "అసలు నువ్వేం మాట్లాడుతున్నావో నీకు తెలుసా..?" అని అడిగాడు. వీళ్ళిద్దరూ డబుల్ మీనింగ్ పంచ్ డైలాగ్స్ వేసుకున్న ఆ ప్రోమోని చూసి నెటిజన్స్ కూడా ఫీల్ అవుతున్నారు.
నూకరాజుని తెగ తిడుతున్నారు. "ఈ నూకరాజు ఓవర్ యాక్షన్ వలన జబర్దస్త్ చూడడమే మానేసాను, అసలు నువ్వు సింగం ఏంట్రా ? నూకరాజు నీకు టీం లీడర్ పోస్ట్ ఎందుకు ? సింగం క్యారెక్టర్ వేయాలి అంటే మినిమం యాక్టింగ్ స్కిల్ ఉండాలి. క్యారక్టర్ పరువు తీసావ్ ? అని పిచ్చ తిట్లు తిడుతున్నారు.
Also Read